AP Teahcers Compassionate Appointments: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. పాఠశాల విద్యలోనే అనేక అంశాలపై దాదాపు నాలుగు గంటలపాటు వారితో చర్చించారు. టీచర్లపై యాప్‌ల భారం తగ్గించామని.. ఇంకా అమలులో ఉన్న విద్యేతర యాప్‌లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తామన్నారు మంత్రి లోకేష్. పరీక్షా ఫలితాల విషయంలో ప్రైవేటు పాఠశాలలో పోటీపడాలని నిర్దేశించారు. ఆంధ్రా మోడల్ విద్యా విధానం టీచర్లతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడకూడదన్నారు.