AP Govt Released Funds To School Needs: ఏపీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.. ప్రభుత్వ అధికారులు సమస్యను వివరించిన వెంటనే స్పందించారు. వెంటనే పెండింగ్ జీతాలు, నిధులు చేయాలని ఆదేశించడంతో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. స్కూళ్లలో పనిచేసే నైట్ వాచ్‌మెన్‌లు, ఆయాలకు జీతాలు.. టాయిలెట్ క్లీనింగ్ మెటీరియల్‌కు పెండింగ్ బకాయిల్ని చెల్లించారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలియజేశారు.