Andhra Pradesh Ntr Bharosa Pension Scheme In Eligible Persons: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి కలెక్టర్లకు సూచనలు చేశారు. పింఛన్ల విషయంలో సీరియస్‌గా ఉండాలని చెబుతూనే.. అనర్హులు పింఛన్లను కట్ చేయాల్సిందే అన్నారు. మూడు నెలల్లో అనర్హులను గుర్తించి తొలగించే పని పూర్తి చేయాలని ఆదేశించారు. నకిలీ పింఛన్లపై ఫిర్యాదులు రావడంతో పైలట్ ప్రాజెక్టు కింద రెండు రోజుల పాటూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో క్లస్టర్‌లో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.