Ntr Bharosa Pension Scheme Spouse Option: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారంతా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో.. గ్రామ, వార్డు సచివాలయాల్లో 'స్పౌజ్ పెన్షన్' ఆప్షన్ ఓపెన్ అయ్యిందన్నారు. స్పౌజ్ పెన్షన్ల దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. వచ్చే నెలలో పెన్షన్ పొందేందుకు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తులను అందజేస్తే ఆమోదిస్తారన్నారు.