AP Govt Stop Welfare Schemes For Those People: ఏపీలో వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిలిపివేసే ఆలోచనలో ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన వారికి పథకాలు రావన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. గతంలో 20 వేల ఎకరాల్లో గంజాయి సాగు జరిగేదని, ప్రస్తుతం అది 90 ఎకరాలకు తగ్గిందని వివరించారు. గిరిజనులకు ఉపాధి కల్పించడానికి పండ్ల మొక్కలు ఇవ్వాలని నిర్ణయించామని ఆమె పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం త్వరలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు.