Andhra Pradesh Govt Rs 7 Lakhs Help To Farmers: వ్యవసాయశాఖమంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో వ్యవసాయ సంబంధ కారణాలతో 39 మంది రైతులు ఆత్మహత్యలు నమోదయ్యాయన్నారు. రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి పునరావాస ఫ్యాకేజీగా రైతులు,కౌలు రైతుల కుటుంబ సభ్యులకు రూ.7లక్షల ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. 2024 జూన్‌కు ముందు 103 ఆత్మహత్యలు జరిగాయన్నారు.