AP Govt On BC Subsidized Loans Ceiling: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి స్వయం ఉపాధి రుణాల రాయితీపై కీలక నిర్ణయం తీసుకుంది. యూనిట్ విలువలో 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు. గతంలో రాయితీపై ఉన్న పరిమితిని తొలగించారు. బీసీ సంక్షేమ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.890 కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యోతిబా ఫులే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. దాదాపు 7 వేల మంది బీసీ లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు అందజేశారు.