Andhra Pradesh Nirudyoga Bruthi Online 2025: ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో ఉంది. వచ్చే నెలతో పాటూ మే నెలలో కొన్ని పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే మరో పథకం అమలు అంశంపై శాసనమండలిలో వైఎస్సార్‌సీ ప్రస్తావించింది. నిరుద్యోగ భృతి పథకం అమలుపై ప్రశ్నించగా.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానం ఇచ్చారు.