ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాయితీ పొందేందుకు ఆక్వా రైతులకు మరో నెలరోజులు సమయం ఇచ్చింది. ఇప్పటి వరకూ కేవలం 30 శాతం మంది మాత్రమే ఈ రాయితీ విద్యుత్ కోసం నమోదుూ చేసుకున్నారని కలెక్టర్ల సమావేశంలో అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదించారు. ఈ నేపథ్యంలో ఆక్వా రైతులకు మరో నెలరోజులు సమయం ఇవ్వాలని.. ఆ తర్వాత నమోదు చేసుకున్న వారికి రాయితీ విద్యుత్ అందించాలని ఆదేశించారు.