Andhra Pradesh Free Motorized Tricycle Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త తెలిపింది. 100 శాతం రాయితీతో మూడు చక్రాల వాహనాలు అందించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలపడంతో, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. 2025-26 సంవత్సరానికి గాను ప్రతి నియోజకవర్గానికి 10 వాహనాల చొప్పున మొత్తం 1,750 వాహనాలను పంపిణీ చేయనున్నారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.