Liquor Home Delivery In AP: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పింది.. బెల్ట్ షాపులు ఉండటానికి వీల్లేదని చెప్పింది. కానీ ఏలూరు జిల్లాలో మాత్రం కొందరు రెచ్చిపోతున్నారు.. ఏకంగా మద్యాన్ని హోం డెలివరీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియో బాగా వైరల్ కావడంతో ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగి ఆ వ్యాన్‌ను పట్టుకున్నారు.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎక్సైజ్ అధికారులు.