ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్ స్టూడెంట్స్‌కు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యార్థులకు భారం తగ్గనుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పుడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ తీర్చేశారు. స్కూల్ పిల్లలు అధిక బరువు కలిగిన పాఠ్యపుస్తకాలతో తీవ్ర అవస్థలు పడుతున్నారని గుర్తించిన నారా లోకేష్.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల బ్యాగ్ బరువు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా బ్యాగ్ బరువును తగ్గించేశారు.