AP Ips Officers Memos Reasons: ఏపీలో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు మెమో జారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఎస్‌లు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుల విచారణలను వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్‌లు ప్రభావితం చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం గుర్తించింది. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. వీటిని గుర్తించిన నిఘా విభాగం.. ప్రభుత్వానికి ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక ఇచ్చినట్లు సమాచారం.