Andhra Pradesh Parents Teachers Meeting In November 14th: ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో లోకేష్ సమీక్ష చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను లీక్ ప్రూఫ్‌గా మార్చాలని లోకేశ్ ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లలో బెంచీలు, మంచినీరు, టాయ్ లెట్స్ వంటి సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కాపీ బుక్స్, డ్రాయింగ్ బుక్స్ తో విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ మెంట్ చేసే అంశాన్ని పరిశీలించాలని కూడా సూచనలు చేశారు.