Andhra Pradesh Schools Holidays: ఏపీని వాన ముంచెత్తింది.. కొన్ని జిల్లాల్లో శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. విశాఖ, విజయవాడతో పాటూ పలు నగరాల్లో భారీగా వానలు కురువడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. రోడ్లపై నీళ్లు నిలబడిపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారంఎడ తెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నేడు అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సృజన సెలవు ప్రకటించారు. విశాఖపట్నం కలెక్టర్ కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు.