Andhra Pradesh Government Land Pooling: ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలో భూసమీకరణ చేపట్టనుంది. విశాఖ గ్రోత్ హబ్‌లో భాగంగా ఈ మూడు జిల్లాలలో 1941.19 ఎకరాల భూమిని సమీకరించనుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది. త్వరలోనే గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తారు.