ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సెలవులపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అదనంగా ఐదు క్యాజువల్ లీవ్స్ మంజూరు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే తమకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.