విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. విద్యా నైపుణ్యాల అభివృద్ధి కోసం సింఘానియా గ్రూప్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ సమక్షంలో సింఘానియా గ్రూప్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా సింఘానియా స్కూల్ ట్రస్టు ద్వారా తిరుపతిలోని 14 పాఠశాలల్లో తొలుత విద్యా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు. అనంతరం అమరావతి, విశాఖ, కాకినాడలకు విస్తరిస్తారు.