Chandrababu Metro Rail Projects Review: ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. విశాఖపట్నం, విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. ఈ మేరకు కేంద్రానికి డీపీఆర్, ప్రతిపాదనలు పంపాలన్నారు. అయితే ఈ రెండు మెట్రో రైళ్ల ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్రమే భరించాలని కోరుతున్నట్లు మంత్రి నారాయణ అన్నారు.