Secunderabad Vizag Vande Bharat Eluru Stop: ఏపీలో ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం– సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ (20708/20707) ఎక్స్‌ప్రెస్ రైలుకు మరో స్టాప్ యాడ్ చేశారు. ఏలూరు స్టేషన్‌లో కూడా వందేభారత్‌కు హాల్ట్ ఇవ్వగా.. ఆదివారం నుంచి అధికారికంగా ఈ రైలు ఆగుతోంది. వందే భారత్ రైలుకు ఏలూరులో మంత్రి పార్థసారధి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, జిల్లా ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఏలూరు స్టేషన్ నుంచి విజయవాడ వరకు వందేభారత్ రైలులో ప్రజా ప్రతినిధులు ప్రయాణించారు.. ప్రయాణికులతో మాట్లాడారు.