Rajamahendravaram railway station Get 271 Crore: ఏపీలో రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై కేంద్రం ఫోకస్ పెట్టింది. తాజాగా ప్రకటించిన బడ్జెట్‌లోనూ ఏపీ రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచింది. ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు సుమారుగా రూ. 9,400 కోట్లు కేటాయించింది. అలాగే అమృత్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని 73 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌కు కేంద్రం రూ.271 కోట్లు కేటాయించింది. ఈ నిధుల సాయంతో రాజమండ్రి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి రైల్వేస్టేషన్‌ను ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.