AP Mid Day meals Scheme inter students: ఇంటర్ చదివే విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. జనవరి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనుంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలిలో మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు.. జనవరి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కేజీబీవీల్లో చదివే లక్షా 40 వేల మంది ఇంటర్ విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది.