మామిడి రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులని ఆదుకోవడానికి రూ.168 కోట్ల సబ్సిడీని అందించనుంది. ఒక్కో కేజీ మామిడికి రూ.12 ధర నిర్ణయించగా, కంపెనీలు రూ.8 చెల్లిస్తే, మిగిలిన రూ.4 ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. రైతులు తమ పంటను మార్కెట్లలో స్వేచ్ఛగా అమ్ముకోవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.