Sri City Vande Bharat Sleeper Interiors: తిరుపతి జిల్లా శ్రీ సిటీలో వందేభారత్ స్లీపర్ రైలు ఇంటీరియర్స్‌ను బీఎఫ్‌జీ ఇండియా సంస్థ తయారు చేస్తోంది. గతంలో మెట్రో, వందేభారత్ రైళ్లకు ఉత్పత్తులను అందించామని సంస్థ తెలిపింది. మరోవైపు చిత్తూరు జిల్లా పూతలపట్టులో కొత్త హోమియో వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతులు లభించాయి. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టుకు రోడ్డు, రైలు మార్గాల కోసం అటవీ భూమిని ప్రభుత్వం కేటాయించింది.