ఏప్రిల్ 15న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. అమరావతి అభివృద్ధి పనుల వేగవంతం, మంత్రుల సిబ్బంది అవినీతి ఆరోపణలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఎస్‌ఐపీబీ ఆమోదాలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై సమీక్ష జరగనుంది. ఆర్థికాభివృద్ధికి ఊతం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.