West Godavari Zp Chairman Resign To Ysrcp: ఏలూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి ఆళ్లనాని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయగా.. ఇటీవల మేయర్ దంపతులు నూర్జహాన్, పెదబాబు పార్టీని వీడారు. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీతో పాటు ఆమె భర్త వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు కూడా పార్టీకి రాజీనామా చేశారు. వీరు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.