ఒంగోలులో ట్రాఫిక్ సీఐపై ఓ మైనర్ దాడికి ప్రయత్నించాడు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. సదరు మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే వ్యవసాయ మార్కెట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కాగా.. సీఐ పాండురంగారావు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అరటి పండ్లు అమ్ముతున్న మైనర్‌ను తప్పుకోవాలని ఆదేశించగా.. వాగ్వాదం జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ వాగ్వాదం సమయంలోనే మైనర్ కత్తితో దాడికి యత్నించినట్లు తెలిపారు.