ప్రకాశం జిల్లా ఒంగోలులో కూరగాయల మార్కెట్ వద్ద ఉద్రిక్తత కనిపించింది. చిరు వ్యాపారుల షాపుల్ని కూల్చివేసేందుకు మున్సిపల్ సిబ్బంది సిద్ధమయ్యారు. వెంటనే వ్యాపారులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల సమక్షంలో కూల్చివేతలు జరిగాయి. ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్న తమ షాపుల్ని తొలగించడం దారుణమంటూ చిరు వ్యాపారుల ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు పెట్రోల్ బాటిళ్లతో ఆందోళన చేపట్టగా.. పోలీసులు అడ్డుకున్నారు.