ఒంగోలులో రామ్‌గోపాల్ వర్మ.. పోలీస్ స్టేషన్‌లో విచారణ

2 months ago 6
ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ హాజరయ్యారు. గతేడాది నవంబర్ 11వ తేదీన టీడీపీ లీడర్ రామలింగం ఫిర్యాదుతో ఆర్జీవీపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే ఆర్జీవీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది.. దీంతో వర్మ విచారణకు వచ్చారు. విచారణకు వస్తున్న ఆర్జీవీని వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. ఒంగోలు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీకాంత్‌బాబు ఆయన్ను ప్రశ్నించారు.
Read Entire Article