ఏపీ విద్యాశాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో అనేక మార్పులు, సంస్మరణలు తీసుకువస్తున్నారు నారా లోకేష్. పరీక్షల హాల్ టికెట్లు, ఫలితాలు కూడా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విడుదల చేస్తూ పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కాలేజీల్లో చదివి ఇంటర్ పరీక్షల్లో మెరిసిన విద్యార్థులను నారా లోకేష్ సన్మానించారు. వారికి ల్యాప్‌టాప్‌లు అందించారు. ఈ క్రమంలోనే తన మనసులోని ఆలోచనను బయటపెట్టారు.