నిజామాబాద్‌లో ఏటీఎంలలో నగదు నింపే ప్రైవేట్ ఏజెన్సీ ఉద్యోగి .. రూ.40.50 లక్షల నగదుతో పరారయ్యాడు. ఎల్లమ్మగుట్టలోని ఆఫీస్‌లో ఎవరూ లేని సమయంలో అతను నగదు బ్యాగ్‌ను బైక్‌పై పెట్టుకొని ఉడాయించాడు. ఈ ఘటనపై నాల్గవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మోసం నగదు నిర్వహణలో ఉన్న భద్రతా లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.