సామాజిక అంశాలపై చైతన్యం కల్పించటం కోసం మంజునాథ్ అనే వ్యక్తి చేపట్టిన సైకిల్ యాత్ర గుంటూరుకు చేరుకుంది. మంజునాథ్ తన సైకిల్ యాత్రను హిందూపురం నుంచి అమరావతి వరకూ చేపట్టారు. ఈ యాత్ర శుక్రవారం నాటికి గుంటూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవితో భేటీ అయ్యారు మంజునాథ్. తన యాత్ర వివరాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మంజునాథ్ కృషిని గళ్లా మాధవి ప్రశంసించారు.