వరంగల్‌లో ఒక స్కూటీకి ఏకంగా 233 పెండింగ్ ఛలాన్లు ఉన్నట్లు గుర్తించారు ట్రాఫిక్ పోలీసులు. మొత్తం రూ.45,350 జరిమానా విధించారు. కాజీపేటలో ట్రాఫిక్ సీఐ వెంకన్న ఈ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఈ విషయం తెలిసింది. స్కూటీ యజమాని అస్లాంగా చెబుతుండగా.. అసలు ఓనర్ పేరు మాత్రం రికార్డుల్లో వేణుగోపాల్ యాదవ్ గా ఉంది. ఎక్కువ ఛలాన్లు హెల్మెట్ లేకుండా నడిపినందుకే ఉన్నాయి. ఈ టూవీలర్ కరీంనగర్, హైదరాబాద్, వరంగల్‌లో తిరిగినట్లు తెలిసింది. స్కూటీ విలువ రూ.20,000 కూడా లేకపోగా, ఫైన్ మాత్రం రూ.45,350 ఉంది.