తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులకు పునరావాస విధానం ద్వారా ఆర్థిక చేయూతనిస్తోందని ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. దేశంలోనే అత్యుత్తమమైన ఈ విధానంలో భాగంగా.. ఇటీవల లొంగిపోయిన ముగ్గురు ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులకు రూ. 5.25 లక్షల రివార్డులను అందజేశారు. అజ్ఞాతం వీడిన వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మెరుగైన జీవితం అందించేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ భరోసా ఇచ్చారు.