హైదరాబాద్ వాసులకు నిత్యం సేవలు అందించే మెట్రో రైలుకు సంబంధించిన సోషల్ మీడియా అంకౌట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో అధికారులు ధ్రువీకరించారు. హ్యాక్ అయిన ట్విట్టర్ అకౌంట్‌లోనే.. ఈ అకౌంట్ హ్యాక్ అయ్యిందని.. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ అకౌంట్ నుంచి వచ్చే ఏ లింక్‌ను క్లిక్ చేయొద్దని ప్రయాణికులకు సూచించారు. అయితే.. హైదరాబాద్ మెట్రో ట్విట్టర్ అకౌంట్‌లో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ప్రకటన రావటంతో.. హ్యాక్ అయినట్టుగా అధికారులు గుర్తించారు.