Bangaru Bonam To Bhadrakali Ammavaru: తెలంగాణలో బోనాల పండుగ సందడి నెలకొంది. ఈ సందర్భంగా వరంగల్ భద్రకాళి అమ్మవారికి ప్రభుత్వం బంగారు బోనం సమర్పించనుంది. ఆలయ చరిత్రలో ఇది తొలిసారి కావడం విశేషం. జూన్ 22న మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఉత్సవానికి 200 మంది కళాకారులు, వందలాది మహిళలు బోనాలతో హాజరుకానున్నారు.