హైదరాబాద్‌లో హైడ్రా యాక్షన్‌లోకి దిగి దూసుకుపోతోంది. ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని.. సమస్య ఎక్కడుంటే అక్కడ టెంట్ వేసుకుని మరీ పరిష్కరిస్తోంది. ఇందులో భాగంగానే.. శుక్రవారం (ఫిబ్రవరి 07న) రోజున అమీన్‌పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. అక్కడి ప్లాట్ల యజమానుల ఫిర్యాదు మేరకు అక్కడికి వచ్చిన రంగనాథ్‌కు, సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీంకు మధ్య సీరియస్ డిస్కషన్ జరిగింది.