తెలంగాణలోని సుమారు 5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీనే వీరికి జీతాలు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను సిద్ధం చేసి.. ఏజెన్సీలు 25వ తేదీలోపు అటెండెన్స్ వివరాలు సమర్పించేలా ఆదేశాలు జారీ చేసింది. పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపులపై కూడా ప్రభుత్వం పర్యవేక్షణ పెంచనుంది. మే 1 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుండగా.. ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు తొలగనున్నాయి.