గత కొంతకాలగా సంచలనంగా మారిన హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారంపై మొట్టమొదటిసారిగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. హర్యానాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. ఈ వివాదంపై స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. తాము పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బుడ్లోజర్లతో అడవులను నాశనం చేసే పనిలో బిజీగా ఉందని దుయ్యబట్టారు.