హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలోనే కాకుండా నేషనల్ మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అక్కడ జింకలు, ఏనుగులు, ఇతర జంతువులకు హాని కలిగిందంటూ సేవ్ హెచ్‌సీయూ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే జంతువులకు ఎలాంటి హాని జరగలేదని అధికారులు, ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే తాజాగా కంచ గచ్చిబౌలి భూముల్లో ఏనుగు గాయపడింది అంటూ వీడియో వైరల్ అవుతోంది.