Kandukur Boy Gold Bag Found On Road: నెల్లూరు జిల్లా కందుకూరులో ఓ బాలుడు నిజాయితీకి పోలీసులు ఫిదా అయ్యారు. ఓ బాలుడికి స్థానికంగా కూరగాయల మార్కెట్ దగ్గర రూ.7 లక్షల విలువ చేసే బంగారం ఉన్న బ్యాగ్ దొరికింది. వెంటనే ఆ బాలుడు ఆ బ్యాగ్‌ను తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. విద్యార్థి నిజాయితీని పోలీసులు మెచ్చుకున్నారు. అలాగే ఆ బంగారం బ్యాగ్‌ను పోగొట్టుకున్న బాధితుడికి తిరిగి అప్పగించారు.