కడప: ప్రేమోన్మాది దారుణం.. ఇంటర్ బాలిక గొంతు కోసి హత్య..

2 months ago 19
వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఖాజీపేట మండలంలో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. ఇంటర్ విద్యార్థిని గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడిన వెంకటేష్ అనే యువకుడు.. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను ఒత్తిడి తెచ్చాడు. అయితే అందుకు ఆమె అంగీకరించకపోవటంతో.. వెంట తెచ్చుకున్న కత్తితో బాలికపై దాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. కడప రిమ్స్‌కు తరలించే క్రమంలో మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడకు చేరుకుని నిందితుణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Entire Article