కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి హాజరైన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.. గతంలోనూ ఇలాగే చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ సురేశ్‌బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను మేయర్ అవమానపరుస్తున్నారని.. మహిళను అవమానిస్తే 'మీ నాయకుడు' సంతోషిస్తారేమో.. తన కుర్చీని లాగేస్తారని మేయర్ భయపడుతున్నట్లున్నారన్నారు. అందుకే ఆయన కుర్చీలాట ఆడుతున్నారని.. విచక్షణాధికారం ఉందని మేయర్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. ఆయనకు మహిళలంటే చిన్నచూపని.. అందుకే మహిళలను నిలబెట్టారన్నారు. గత పాలనలో కుడి, ఎడమ వైపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకున్నారని.. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కుర్చీ వేయకపోవడంలో ఆంతర్యమేంటి? అని ప్రశ్నించారు. అవినీతిపై చర్చిస్తారనే సమావేశాలు జరగకుండా చేస్తున్నారన్నారు మాధవిరెడ్డి.