హైదరాబాద్‌లో ఓ ట్రాన్స్ పోర్ట్ వాహనం నడుపుతున్న డ్రైవర్‌కి వింత అనుభవం ఎదురైంది. తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లి వైద్యులకు తన పరిస్థితి వివరించాడు. వైద్యులు అతనికి స్కానింగ్, ఇతర టెస్టులు చేయగా.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు.. అతడి కడుపులో నుంచి 5 అంగుళాల పొడవైన దబ్బనాన్ని బయటకు తీశారు.