సిక్కోలు జిల్లా రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ హాట్ టాపిక్‌గా మారారు. కాళింగ సామాజికవర్గ ఏకీకరణ అనే ఉద్దేశంతో దువ్వాడ కాళింగ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న తమ్మినేని సీతారాం, కూన రవికుమార్ హాజరు కావటం.. వేదికపై చేతులు కలిపి ఐక్యతను ప్రదర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. తమ్మినేని సీతారాం.. కూన రవికుమార్ వరుసకు మామా, మేనల్లుడు అవుతారు. అయితే పొలిటికల్‌గా వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.