Braindead boy Organ Donation: పదేళ్ల పసిప్రాయం పాడెపై విగతజీవిలా మారింది. అల్లారుముద్దుగా పెరిగిన కొడుకుకు తల్లిదండ్రులే కొరివి పెట్టాల్సి వచ్చింది. పుట్టెడు దు:ఖంలోనూ గుండెల్లోని బాధను దిగమింగుకొని అవయవదానం చేసి మరికొందరి కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఇదంతా చూసిన ఊరు ఎక్కెక్కి ఏడ్చేసింది.