కమ్మ కులం ప్రస్థానవ ఎందుకు.. వైఎస్ జగన్‌కు ప్రశ్న

1 year ago 24
కమ్మ నేతలపై ఇటీవల మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (చేసిన వ్యాఖ్యలను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు స్పందించాయి. 'కమ్మ వారు అన్ని పార్టీల్లో ఉన్నారని.. వైసీపీ పార్టీలో కూడా ఉన్నారు. ఓదార్పు యాత్రలో కమ్మ కులం గురించి ప్రస్తావన అనేది అనవసరమైన విషయమం. కొడాలి నాని లాంటి తమ సామాజిక వర్గం వారితో తమనే తిట్టారు. రాజకీయాలతో సంబంధం లేని నారా భువనేశ్వరిని అసెంబ్లీలో తిట్టించారు. అమరావతిని కమ్మరావతి అన్నారు.. అధికారులకు కులాలను ఆపాదించి అవమానపరిచారు. ఆరాజకీయాలు మాట్లాడుకోండి అంతే కానీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించవద్దు. ఓదార్పు యాత్రలో నరికేస్తాం అని వ్యాఖ్యలు చేసిన వారిని ఖండించలేదు.. పైగా ఆ వ్యాఖ్యలకు జగన్ సంతోషపడ్డారు. జగన్ తన విధానాలు మార్చుకోవాలి, మతాలు కులాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి యత్నిస్తున్నారు. అన్ని కులాలను సమానంగా చూడాలి.. అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేస్తేనే ఎవరైనా అధికారంలోకి వస్తారు' అని కమ్మ సంఘాల నేతలు అన్నారు.
Read Entire Article