రాష్ట్రంలో పెను సంచలనం రేపిన కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ ఘటనలో పోలీసులు కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరికొంతమంది నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు. దొంగతనం కేసులో 2 నెలల క్రితమే నిందితులు.. 4 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారని తెలిపారు. ఈ దొంగతనంలో మొత్తం 13 మంది నిందితులు ఉన్నారని.. 161 తులాల గోల్డ్, 112 క్యారెట్ల వజ్రాలు ఎత్తుకెళ్లినట్లు చెప్పారు.