మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన వెళ్తున్న లిఫ్ట్ తెగిపడింది. ఈ ఘటనలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఓ రైతును పరామర్శించేందుకు మంత్రి అడ్లూరి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు.. హైదరాబాద్‌లో ఓ చిన్నారి లిఫ్ట్‌లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.