కరీంనగర్: స్కూల్‌లో క్షుద్రపూజల కలకలం.. ఎంతకు తెగించార్రా..!

2 months ago 9
కరీంనగర్ జిల్లా దుర్శేడ్ గవర్నమెంట్ హైస్కూల్‌లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. తరగతి గది ముందు వరండాలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే విషయాన్ని స్కూల్ హెడ్ మాస్టర్‌కు చెప్పారు. ఉపాధ్యాయులు అక్కడకు వెళ్లి చూడగా.. గది ముందు నిమ్మకాయలు, పసుపు కుంకుమ ముగ్గు వేసి వెళ్లారు. క్షుద్రపూజలు చూసి విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. క్లాస్ రూమ్‌లలోకి వెళ్లకుండా స్కూల్ ఆవరణలోనే ఉండిపోయారు. ప్రిన్సిపల్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో.. దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Read Entire Article